: పిచ్చాపాటీగా మాట్లాడితే ప్రచురించారు... దావూద్ లొంగుబాటుపై నీరజ్ వివరణ


దావూద్ లొంగుబాటుపై, తనకు తెలిసిన విలేకరితో పిచ్చాపాటీగా మాట్లాడానే తప్ప ఈ విధంగా ప్రచురిస్తారని తాను అనుకోలేదని సీబీఐ మాజీ డీఐజీ నీరజ్ కుమార్ వాపోయారు. దావూద్‌ కు లొంగిపోవాలనే ఆలోచన లేదని, ఒకవేళ ఉంటే ఆ ప్రయత్నాన్ని ఎవరూ అడ్డుకోరని అన్నారు. తాము పాకిస్థాన్‌ లోని ఓ వ్యక్తిని తీసుకువచ్చేందుకు ప్లాన్ వేశామని, చివరి క్షణాల్లో ప్రయత్నాలు వృథా అయ్యాయని అన్నారు. అండర్ వరల్డ్ డాన్, ముంబై పేలుళ్ల నిందితుడు దావూద్ ఇబ్రహీం, భారత పోలీసులకు లొంగిపోవాలని భావించి, గొంతెమ్మ షరతులు విధించాడని, వాటిని కేంద్రం అంగీకరించకపోవడంతో లొంగుబాటు నిలిచిందని నీరజ్ కుమార్ తెలిపినట్టు వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. కాగా, గతంలో దావూద్ తనకు ఫోన్ చేసి లొంగుబాటు గురించి చర్చించినట్టు ప్రముఖ న్యాయవాది రాంజెఠ్మలానీ సైతం వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News