: మనదేశంలో పనికిమాలిన పద్ధతులు నేర్పారు: కేసీఆర్


మనదేశంలో పనికిమాలిన పద్ధతులు నేర్పారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. నాగార్జున సాగర్ లో జరుగుతున్న శిక్షణా తరగతుల్లో ఆయన మాట్లాడుతూ, మనిషికి తెలిసింది తక్కువ... తెలుసుకోవాల్సింది ఎక్కువని అన్నారు. రోజురోజుకీ మారుతున్న పరిజ్ఞానం పెంచుకుంటేనే ప్రపంచంలో మనగలుగుతామని ఆయన చెప్పారు. మన దేశంలో ఇలా నేర్పలేదు కానీ, అప్ డేట్ కావాలని ఆయన అన్నారు. ఆంధ్రోళ్లు హైదరాబాదు వదులు కోవడం వల్ల తెలంగాణ సర్ ప్లస్ స్టేట్ గా మారిందని, ఆంధ్రా డెఫిషిట్ స్టేట్ గా మారిందని కేంద్రంలో పిచ్చిమాటలు మాట్లాడుతున్నారని, వాటిని ఖండించి తెలంగాణ రాష్ట్రం మొదటి నుంచీ ధనిక రాష్ట్రమని ప్రపంచానికి తెలియచెప్పాలని ఆయన సూచించారు.

  • Loading...

More Telugu News