: కేసీఆర్ పనికిమాలిన నిర్ణయాలను చూసి దేశం మొత్తం నవ్వుకుంటోంది: డీకే అరుణ


టీఎస్ సీఎం కేసీఆర్ పై టీకాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ డీకే అరుణ విరుచుకుపడ్డారు. కేసీఆర్ వ్యవహారశైలి రాజ్యాంగ విరుద్ధంగా ఉంటోందని ఆమె ఆరోపించారు. ఆయన తీసుకుంటున్న పనికిమాలిన నిర్ణయాలను చూసి యావత్ దేశం నవ్వుకుంటోందని ఎద్దేవా చేశారు. ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలు రాజీనామా చేసి, ఎన్నికలకు వెళ్తే... ప్రజల్లో వారికెంత మద్దతు ఉందో తెలుస్తుందని అన్నారు. ప్రతిష్ఠాత్మకమైన కార్యక్రమంగా చెప్పుకుంటున్న మిషన్ కాకతీయ... కమిషన్ల కార్యక్రమంగా మారిందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ పథకాలను ప్రజల కోసం చేపట్టారా? లేక టీఆర్ఎస్ కార్యకర్తల కోసం చేపట్టారా? అంటూ నిలదీశారు. మారువేషంలో వెళ్తే టీఆర్ఎస్ ప్రభుత్వం గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో కేసీఆర్ కు తెలుస్తుందని సూచించారు.

  • Loading...

More Telugu News