: 7న ఒబామాతో సమావేశమవుతున్నా..పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యం: నారా లోకేశ్
అమెరికా పర్యటనపై టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేశ్ కొద్దిసేపటి క్రితం విస్పష్ట ప్రకటన చేశారు. రేపటి నుంచి ఈ నెల 12 దాకా అమెరికాలో పర్యటించనున్నట్లు ఆయన వెల్లడించారు. పర్యటనలో భాగంగా ఈ నెల 7న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో భేటీ కానున్నానని, ఈ మేరకు వైట్ హౌస్ తనకు అపాయింట్ మెంట్ ఇచ్చిందని ఆయన తెలిపారు. ఏపీకి పెట్టుబడులను రాబట్టడమే లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్నానని, ఈ క్రమంలో ఆ దేశంలోని వివిధ రాష్ట్రాల గవర్నర్లను కూడా కలిసేందుకు యత్నిస్తానని ఆయన పేర్కొన్నారు.