: చంద్రబాబు కన్నా కేసీఆరే సీనియరట... హరీశ్ రావు ఆసక్తికర వ్యాఖ్య
తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి, టీఆర్ఎస్ సీనియర్ నేత తన్నీరు హరీశ్ రావు నిన్న ఓ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. తెలుగుదేశం పార్టీలో ఆ పార్టీ ప్రస్తుత అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కన్నా, తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆరే సీనియర్ అని ఆయన చెప్పుకొచ్చారు. నందమూరి తారకరామారావు స్థాపించిన టీడీపీలో కేసీఆర్ 1982లో చేరారని చెప్పిన హరీశ్ రావు, 1983లో చంద్రబాబు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారన్నారు. ఈ లెక్కన టీడీపీలో చంద్రబాబు కంటే కేసీఆరే సీనియర్ అని ఆయన తేల్చేశారు.