: టీటీడీ చైర్మన్ గా నేడు చదలవాడ బాధ్యతల స్వీకరణ
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి చైర్మన్ గా తిరుపతి మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి నేడు పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. సుదీర్ఘకాలం పాటు సాగిన ఊగిసలాట తర్వాత ఎట్టకేలకు ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఇటీవల చదలవాడ నేతృత్వంలో టీటీడీ పాలక మండలిని ఖరారు చేసిన సంగతి తెలిసిందే. వెనువెంటనే ఏపీ సర్కారు కూడా పాలకమండలిపై అధికారికంగా ఉత్వర్వులు జారీ చేసింది. అయితే మొన్న తిరుమల వెంకన్నను దర్శించుకున్న చదలవాడ, మంచి ముహూర్తాన్ని నిర్ణయించాలని వేదపండితులను కోరారు. ఈ మేరకు నేటి ఉదయం 11.09 నిమిషాలకు దివ్యమైన ముహూర్తం ఉందన్న పండితుల సూచన మేరకు సరిగ్గా అదే సమయానికి ఆయన టీటీడీ చైర్మన్ కుర్చీలో కూర్చోనున్నారు.