: రామ్ ఎనర్జీ ఏంటో తెలిసింది: రకుల్ ప్రీత్, సోనాల్ చౌహాన్


రామ్ ను ఎందుకు ఎనర్జిటిక్ అంటారో షూటింగ్ ప్రారంభమైన తరువాత అర్థమైందని హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తెలిపింది. 'పండగ చేస్కో' ఆడియో వేడుకలో హీరోయిన్లిద్దరూ రామ్ గురించి మాట్లాడుతూ, రామ్ ఎలాంటి సన్నివేశాన్నైనా రక్తికట్టిస్తాడని అన్నారు. రామ్ తో పని చేయడం ఎంతో బాగుందని సోనాల్ చౌహాన్ చెప్పింది. శరీరంలో ఎంత బాధ ఉన్నా షాట్ చెప్పగానే అంతా మర్చిపోయి రామ్ పనిచేస్తాడని, అదెలా సాధ్యమో ఎవరికీ అర్థం కాదని రకుల్ చెప్పింది. తమ ఇద్దర్నీ సినిమాలో అందంగా చూపించారని వారు తెలిపారు. సినిమా కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నామని వారు తెలిపారు. సినిమా అందర్నీ ఆకట్టుకుంటుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News