: ఈ స్క్రిప్టు గోపీ చేతిలో పడడమే సగం సక్సెస్: రామ్


'మసాలా' సినిమా చేస్తున్నప్పుడు వెలిగొండ శ్రీనివాస్ ఈ సినిమా స్క్రిప్టు తీసుకువచ్చారని రామ్ చెప్పాడు. 'పండగ చేస్కో' ఆడియో వేడుకలో రామ్ మాట్లాడుతూ, ఈ స్క్రిప్టు దొరకడం తన అదృష్టమని భావించానని, అయితే ఈ స్క్రిప్టు గోపీచంద్ మలినేనికి దొరకడం స్క్రిప్టు అదృష్టమని అన్నాడు. సినిమాలో ప్రతి ఒక్కరూ అద్భుతంగా నటించారని, హీరోయిన్లు మంచి ప్రదర్శన చేశారని చెప్పాడు. ఇంత పెద్ద సినిమాను చాలా కాలం ఎలాంటి ఇబ్బంది రాకుండా తీసిన నిర్మాతలను అభినందించకుండా ఉండలేమని రామ్ తెలిపాడు. సినిమాకు తమన్ మంచి మ్యూజిక్ అందించాడని, సినిమా బాగుంటుందని నమ్ముతున్నానని, అభిమానులను ప్రేక్షకులను అలరిస్తుందని రామ్ ఆశాభావం వ్యక్తం చేశాడు.

  • Loading...

More Telugu News