: తారా చౌదరి ఇంట్లో రాత్రి గొడవ...ముగ్గురిపై కేసు
వ్యభిచారం కేసుతో వెలుగులోకి వచ్చిన తారాచౌదరి మరోసారి వార్తల్లోకి వచ్చింది. హైదరాబాదు, బంజారాహిల్స్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం...బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2లోని ఇందిరానగర్ ఫేజ్-3, వివేకానంద స్కూల్ సమీపంలో తారాచౌదరి అలియాస్ రావిళ్ల రాజేశ్వరి నివాసముంటోంది. అందులోనే తన సినిమా కార్యాలయాన్ని కూడా ఆమె నిర్వహిస్తోంది. గత రాత్రి 9 గంటల ప్రాంతంలో ఆమె నివాసంలో రామినేని దుర్గాప్రసాద్ అనే వ్యక్తి ఘర్షణకు దిగాడు. దీంతో సినిమాలో హీరో వేషం కోసం ఆమె చుట్టూ తిరుగుతున్న వీరమాచనేని సందీప్ అనే యువకుడిని ఆమె పిలిపించింది. దీంతో సందీప్ తన స్నేహితులు ఉదయ్, రాజేష్ లను వెంటబెట్టుకుని ఆమె నివాసానికి వెళ్లాడు. తన భార్యతో గొడవపడితే మధ్యలో మీరెవరంటూ దుర్గాప్రసాద్, సందీప్, అతని స్నేహితులను ప్రశ్నాంచారు. దీంతో వారి మధ్య రేగిన తీవ్ర వాగ్వాదం కారణంగా, ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు. ఈ క్రమంలో సందీప్ రాయితో ప్రసాద్ ను గాయపరిచాడు. దీంతో తారాచౌదరి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు వచ్చి నలుగురినీ స్టేషన్ కు తరలించారు. దుర్గాప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సందీప్, ఉదయ్, రాజేష్ పై ఐపీసీ 448, 323, 506 సెక్షన్లపై కేసు నమోదు చేశారు.