: క్లైమాక్స్ లో రామ్ ఇరగదీశాడట!
క్లైమాక్స్ సీన్ లో రామ్ నటనను చూసి ముగ్థుడినయ్యానని తెలుగు సినిమాల్లో విలన్ పాత్రధారి సంపత్ చెప్పాడు. 'పండగ చేస్కో' ఆడియో వేడుక సందర్భంగా సంపత్ మాట్లాడుతూ, షూటింగ్ లో నటించేటప్పుడు మ్యూజిక్, ఎఫెక్ట్స్ ఏమీ ఉండవని, అయినప్పటికీ క్లైమాక్స్ సీన్ లో రామ్ నటనలో గ్రేస్ చూసి చెబుతున్నానని, తెలుగు ప్రేక్షకులను అలరిస్తుందని అన్నాడు. రామ్ నటనలో ఎనర్జీ అభిమానులను ఆకట్టుకుంటుందని, దానికి తోడు అతని అల్లరి అందరినీ అలరిస్తుందని ఇంకో విలన్ పాత్రధారి చెప్పాడు. రామ్ ఎనర్జీ సినిమాకు అదనపు బలమని ప్రభాస్ శ్రీను అన్నాడు. తమన్ మ్యూజిక్ సినిమాను మరింత ఎత్తుకు తీసుకెళ్తుందని వారంతా ఆకాంక్షించారు.