: లక్ష రూపాయలు తీసుకుని భార్యను అతనికి ఇచ్చేయమన్నారు
అరాచకాల ఉత్తరప్రదేశ్ లో దారుణం చోటుచేసుకుంది. కట్టుకున్న భార్యను లక్ష రూపాయలు తీసుకుని వదిలేయమని పంచాయతీ తీర్పు చెప్పింది. గంగాతలా గ్రామానికి చెందిన ఒక రైతు భార్యను అదే గ్రామానికి చెందిన గూండా పలుమార్లు బలవంతంగా లొంగదీసుకున్నాడు. దీంతో అతని అరాచకాన్ని పంచాయతీ పెద్దల వద్దకు రైతు తీసుకెళ్లాడు. విషయం విన్న పంచాయతీ పెద్దలు లక్ష రూపాయలు తీసుకుని భార్యను అతనికి వదిలేయమని తేలిగ్గా సమస్యను పరిష్కరించారు. బలవంతుడైన గూండాకు ఎదురుచెప్పే ధైర్యం లేని రైతు పంచాయతీ ప్రతిపాదనకు అంగీకరించాడు. పంచాయతీ తీర్పును మహిళ మాత్రం అంగీకరించలేదు. మెగుడ్ని కూడా వదిలేసి, అదే గ్రామంలో వేరే ఇంట్లో బిడ్డతో ఒంటరిగా కాపురం పెట్టింది.