: రాణించిన మిల్లర్, బెయిలీ, అక్షర్ పటేల్...ఢిల్లీ లక్ష్యం 119
ఢిల్లీ డేర్ డెవిల్స్ బౌలర్లు రాణించడంతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బ్యాట్స్ మెన్ పెవిలియన్ కు క్యూ కట్టారు. టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన పంజాబ్ ను జహీర్ ఖాన్ దెబ్బతీశాడు. వరుస ఓవర్లలో ఓపెనర్లిద్దరినీ అవుట్ చేసి ఢిల్లీకి బ్రేక్ ఇచ్చాడు. అనంతరం డుమిని వికెట్ తీయగా కౌల్టర్ నైల్ నాలుగు వికెట్లు తీసి సత్తా చాటాడు. దీంతో పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్ల ధాటికి సెహ్వాగ్ (1), వోహ్రా (1), షాన్ మార్ష్ (5), పెరీరా (3) దారుణంగా విఫలమయ్యారు. డేవిడ్ మిల్లర్ (42), బెయిలీ (18) చివర్లో అక్షర్ పటేల్ (22) మెరుపులు మెరిపించడంతో పంజాబ్ జట్టు ఢిల్లీకి 119 పరుగుల లక్ష్యం విధించింది.