: బాహుబలి జూలై 10 రిలీజ్?
రాజమౌళి దర్శకత్వం వహించిన సినిమాలు చూసిన ప్రతిఒక్కరూ ఆయనను అభిమానించకుండా ఉండలేరు. అలాగే తాజాగా ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహర్, ఎస్ఎస్ రాజమౌళిని ప్రశంసించకుండా ఉండలేకపోయారు. బాహుబలికి సంబంధించిన కొత్త పోస్టర్ ను రాజమౌళి తాజాగా ట్విట్టర్లో పెట్టారు. దీనిని చూసిన కరణ్ జోహర్ రాజమౌళిపై ప్రశంసల వర్షం కురిపించారు. సినిమా కోసం ఎంత కష్టపడేందుకైనా రాజమౌళి వెనుకాడరని కరణ్ జోహర్ చెప్పారు. కాగా, బాహుబలి హిందీ సినిమా హక్కుల్ని కరణ్ జోహర్ తీసుకున్నారు. దీంతో ఆయన కూడా ఈ పోస్టర్ ను తన ట్విట్టర్ అకౌంట్లో పోస్టు చేశారు. బాహుబలి సినిమాను జూలై 10న విడుదల చేస్తున్నట్టు ఆయన పేర్కొనడం విశేషం.