: హమ్మయ్య...దొంగ మింగేసిన మంగళసూత్రాన్ని బయటికి రప్పించారు


నాలుగు రోజుల క్రితం దొంగ మింగేసిన రెండున్నర తులాల మంగళసూత్రాన్ని వైద్యులు శస్త్ర చికిత్స లేకుండా బయటకి తీయగలిగారు. వివరాల్లోకి వెళ్తే... ముంబైలో అనిల్ యాదవ్ అనే దొంగ సోమవారం రాజశ్రీ మయేకర్ అనే మహిళ మెడలోని మంగళసూత్రం గొలుసును దొంగిలించాడు. పరారవుతుండగా ఆమె గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో వారు అతనిని వెంబడించారు. ఈ కంగారులో అనిల్ యాదవ్ దానిని మింగేశాడు. దానిని బయటికి తెచ్చేందుకు వైద్యులు నాలుగు రోజులుగా అతడి చేత రకరకాల ఆహారపదార్థాలు తినిపించారు. పలు స్కాన్లు నిర్వహించారు. నాలుగు రోజుల తరువాత దానిని అతను విసర్జించాడు. దీంతో ఎటువంటి సర్జరీ లేకుండా ఆ మంగళసూత్రాన్ని తీసినందుకు వైద్యులు ఆనందించగా, దాని యజమానురాలు రాజశ్రీ మాత్రం దానిని కనీసం చూడలేదు సరికదా, నేరుగా దానిని గోల్డ్ స్మిత్ వద్దకు పంపించేశారు. కరిగించి వేరే నగగా చేసుకుంటే కానీ దానిని ధరించలేనని ఆమె చెప్పారు.

  • Loading...

More Telugu News