: 100 మందిని రక్షించి, 15 టన్నుల టార్పాలిన్ లు, మందులు, దుప్పట్లు ఇచ్చారు


నేపాల్ భూకంప బాధితులను ఆదుకునేందుకు ప్రపంచ దేశాలు తోచిన సాయమందిస్తున్నాయి. ఈ క్రమంలో భూకంపంలో చిక్కుకుపోయిన 100 మందిని రాయల్ ఆస్ట్రేలియా వైమానిక దళం రక్షించింది. వీరిలో 60 మంది ఆస్ట్రేలియా దేశస్థులు ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. భూకంప బాధితులను ఆదుకునేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం రెండు విమానాలు, బాధితుల కోసం 15 టన్నుల టార్పాలిన్ లు, మందులు, దుప్పట్లు పంపించింది. శనివారం సంభవించిన భూకంపం కారణంగా 6 వేల మందికి పైగా మృతి చెందగా, పది వేల మందికి పైగా క్షతగాత్రులుగా మారిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News