: పిల్లలకు న్యుమోనియా రాకుండా ఉండాలంటే...


మనదేశంలో పసిపిల్లల ప్రాణాలను గరిష్టంగా హరించివేస్తున్న మహమ్మారి రోగాల్లో న్యుమోనియా కూడా ఒకటి. కేవలం న్యుమోనియా వల్ల ఏటా 15-20 శాతం మంది పిల్లలు చనిపోతున్నట్లుగా అంచనా. ఈ నేపథ్యంలో గర్బిణులకు పొగతాగే అలవాటు ఉంటే పిల్లలకు కచ్చితంగా న్యుమోనియా సోకుతుందని బోస్టన్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్‌ స్టీఫెన్‌ ఐ.పెల్టన్‌ చెప్పారు. కాలుష్యం, పోషకాహార లోపం, కట్టెలతో వంట వంటి అనేక అంశాలు పిల్లల్లో న్యుమోనియాకు దారి తీస్తుంటాయిట.

భారత్‌లో పసిపిల్లల న్యుమోనియా తీవ్రత ఎంత ఘోరంగా ఉన్నదంటే.. అత్యంత పేదదేశాలైనటువంటి నైజీరియా, కాంగో, ఆఫ్గనిస్తాన్‌, చివరికి పాకిస్తాన్‌ వంటి దేశాలతో పోల్చిచూసినప్పుడు మనదేశంలో పసిపిల్లల న్యుమోనియా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయిట. కొత్త తరం టీకాలను పిల్లలకు ఇవ్వాలని, ప్రభుత్వమే ఈ వ్యాధినివారణకు చర్యలు తీసుకోవాలని డాక్టర్‌ పెల్టన్‌ సూచిస్తున్నారు.

  • Loading...

More Telugu News