: ఆ సమయానికి 270 ప్రాజెక్టులు నిలిచిపోయాయి: గడ్కరీ
తాను కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టే నాటికి దేశవ్యాప్తంగా 270కు పైగా ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నట్టు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారులు, నౌకాయాన శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. భూసేకరణ, పర్యావరణ అనుమతుల్లో ఆలస్యమే ఇందుకు కారణమని చెప్పారు. ప్రాజెక్టుల పెండింగ్ దేశానికి మంచిది కాదని అభిప్రాయపడ్డారు. ఆ ప్రాజెక్టుల అంచనా వ్యయం రూ.3,80,000 కోట్లు అని తెలిపారు. అందులో రూ.90వేల కోట్ల విలువచేసే 44 ప్రాజెక్టులు రద్దు చేశామని వివరించారు. ఇక ఎనిమిది ఈశాన్య రాష్ట్రాల్లో 26 ప్రాజెక్టులకు కొన్ని ఇబ్బందులున్నాయని గడ్కరీ పేర్కొన్నారు.