: మగబిడ్డ పుడతాడని నేను చెప్పలేదు: బాబారాందేవ్


రాజ్యసభలో దుమారం రేపిన పుత్రజీవక్ ఔషధంపై ప్రముఖ యోగా గురువు బాబారాందేవ్ వివరణ ఇచ్చారు. పుత్రజీవక్ ఔషధం తీసుకుంటే మగబిడ్డే పుడతాడని తానెన్నడూ చెప్పలేదని బాబా స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేతలు లేనిపోని ఆరోపణలతో బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు. పుత్రజీవక్ అనేది కేవలం వృక్షజాతి పేరు మాత్రమేనని, ఆ పేరుకు, మగబిడ్డ పుట్టడానికి సంబంధం లేదని ఆయన వివరణ ఇచ్చారు. అలాగే పుత్రజీవక్ మందు తింటే మగ బిడ్డనే జన్మిస్తాడని తాము ఎక్కడా చెప్పలేదని ఆయన తెలిపారు. కాగా పుత్రజీవక్ ఔషధాన్ని నిషేధించాలంటూ ఎంపీ త్యాగి రాజ్యసభలో డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News