: తెలంగాణలో పార్లమెంటరీ సెక్రెటరీ పోస్టుల రద్దుకు హైకోర్టు ఆదేశం!
పార్లమెంటరీ సెక్రెటరీ పోస్టుల విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పోస్టులను రద్దు చేయాలంటూ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. తదుపరి నియామకాలపై తప్పకుండా అనుమతి తీసుకోవాలని చెప్పింది. పార్లమెంటరీ సెక్రెటరీ పోస్టులను సవాల్ చేస్తూ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గతంలో పిటిషన్ దాఖలు చేశారు. దానిని విచారించిన కోర్టు తాజాగా పైవిధంగా తీర్పు వెల్లడించింది.