: శేషాచలం ఎన్ కౌంటర్ కేసును సీబీఐకి అప్పగించాలంటున్న పిటిషనర్లు
శేషాచలం ఎదురుకాల్పుల ఘటన కేసుపై హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. ఈ కేసు విచారణకు ఏర్పాటైన సిట్ కు నేతృత్వం వహిస్తున్న ఐపీఎస్ అధికారి రవిశంకర్ అయ్యన్నార్ పై పలువురు పిటిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. అతనిపై గతంలో ఎదురుకాల్పుల ఆరోపణలు ఉన్నాయని, కేసును సీబీఐకి అప్పగించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. కానీ ప్రభుత్వ విచారణకు మొదట అవకాశం ఇవ్వాలని న్యాయస్థానం పేర్కొంది. వేసవి సెలవుల అనంతరం తదుపరి విచారణ చేపడతామని చెప్పి, కేసును హైకోర్టు వాయిదా వేసింది.