: చెక్ బౌన్స్ కేసులో మాజీ ఎమ్మెల్యే వెంకటస్వామికి జైలు శిక్ష
కర్నూలు జిల్లా నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామికి చెక్ బౌన్స్ కేసులో జైలు శిక్ష పడింది. ఏడాదిపాటు శిక్ష విధిస్తూ హైదరాబాదులోని ఎర్రమంజిల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీర్పు ఇచ్చింది. ఆయనతో పాటు జంగం గోపి, రమేష్ బండారికి కూడా ఏడాది జైలు శిక్ష పడింది. మెదక్ జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించి వెంకటస్వామి ఇచ్చిన చెక్ బౌన్స్ కావడంతో కేసు నమోదైంది. దానిపై గత ఆరేళ్లుగా కోర్టులో ఈ కేసు నడుస్తోంది. బండారి కన్ స్ట్రక్షన్స్ కంపెనీపై ఎస్ ఇబ్రహీం అనే వ్యక్తి వేసిన కేసులో తనను ప్రతివాదిగా చేర్చారంటూ గతంలో వెంకటస్వామి పేర్కొన్నారు.