: కమల్ అభిమానులకు నిరాశ... ఆగిన 'ఉత్తమ విలన్' విడుదల


నేడు విడుదల కావాల్సిన 'ఉత్తమ విలన్' చిత్రం విడుదల ఆగిపోయి కమల్ హాసన్ అభిమానులను నిరాశ పరిచింది. చిత్ర నిర్మాతలకు, ఫైనాన్షియర్లకూ మధ్య డబ్బు విషయంలో వచ్చిన గొడవల నేపథ్యంలో చిత్ర ప్రదర్శన ఆగిపోయినట్టు తెలుస్తోంది. కాగా, ప్రస్తుతం నిర్మాతలకు, ఫైనాన్షియర్లకూ మధ్య చర్చలు జరుగుతున్నాయని, మరికొన్ని గంటల్లో సమస్య పరిష్కారమై సాధ్యమైనంత త్వరగా సినిమాను విడుదల చేస్తామని చిత్ర డిస్ట్రిబ్యూటర్ ఒకరు తెలిపారు. 'ఉత్తమ విలన్' నేడు ఆంధ్రప్రదేశ్ తో పాటు తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు, ఓవర్ సీస్ లో విడుదల కావాల్సి వున్న సంగతి తెలిసిందే. చిత్రం మొదటి రోజు మొదటి ఆట చూడాలని టికెట్లు కొనుక్కున్న అభిమానులు థియేటర్ల వద్ద పడిగాపులు పడుతున్నారు.

  • Loading...

More Telugu News