: హైదరాబాదులో రూ. 67.22 నుంచి రూ. 71.42కు పెరిగిన పెట్రోలు ధర
పెరిగిన ధరల నేపథ్యంలో హైదరాబాదులో లీటరుకి పెట్రో వడ్డన రూ. 4.20 అయింది. నిన్నటివరకూ రూ. 67.22గా ఉన్న లీటరు పెట్రోలు కోసం నేటి నుంచి రూ. 71.42 చెల్లించక తప్పదు. ఇదే సమయంలో విజయవాడలో రూ. 67.89గా ఉన్న ధర రూ. 71.85కు చేరింది. ఢిల్లీలో మాత్రం రాష్ట్ర పన్నుల శాతం తక్కువగా ఉండడంతో లీటరు పెట్రోలు ధర రూ. 59.20 నుంచి రూ. 63.16కు పెరిగింది. ఇక హైదరాబాదులో డీజిల్ ధర రూ. 53.40 నుంచి రూ. 56కు, విజయవాడలో రూ. 55.02 నుంచి రూ. 57.39కి పెరిగింది. పెట్రో ఉత్పత్తుల ధరలను పెంచుతూ చమురు కంపెనీలు తమ నిర్ణయాన్ని వెలువరించిన సంగతి తెలిసిందే.