: మందు కొట్టి యువతితో అసభ్యంగా ప్రవర్తించిన క్యాబ్ డ్రైవర్... తప్పించుకున్న హైదరాబాద్ టెక్కీ
ప్రయాణికులను క్షేమంగా గమ్యం చేర్చాల్సిన క్యాబ్ డ్రైవర్ తన విధిని మరిచాడు. మందు కొట్టి క్యాబ్ నడపటమే కాకుండా, కారెక్కిన యువతితో అసభ్యంగా ప్రవర్తించాడు. పోలీసులకు అందిన ఫిర్యాదు ప్రకారం, సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న ఓ యువతి హైదరాబాదు, గచ్చిబౌలి నుండి కాచిగూడ రైల్వే స్టేషన్ కు వెళ్లేందుకు క్యాబ్ ఎక్కింది. మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తిస్తూ, కారును ర్యాష్ గా డ్రైవింగ్ చేశాడు. కారును ఆపమని ఆ యువతి ఎంతగా వేడుకున్నా వినలేదు. క్యాబ్ రన్నింగ్ లో ఉండగానే యువతి కారు డోర్ తీయడంతో డ్రైవర్ కారు నిలపగా, యువతి తన లగేజీ తీసుకునేందుకు కిందకు దిగింది. డ్రైవర్ మరోసారి అడ్డుకునే ప్రయత్నాలు చేశాడు. అక్కడి నుంచి ఎలాగోలా తప్పించుకున్న యువతి జరిగిన ఘనటపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు క్యాబ్ డ్రైవరును గుర్తించే పనిలో పడ్డారు.