: భర్త పిలిస్తే రావాల్సిందే... మలేషియా మత గురువు ఫత్వా
కట్టుకున్న భర్త ఎప్పుడు డిమాండ్ చేసినా భార్య రావాల్సిందేనని మలేషియాకు చెందిన ముస్లిం మత గురువు పెరాక్ ముఫ్తీ తాన్ శ్రీ హరుస్సనీ జకీరియా ఫత్వా జారీ చేశారు. వైవాహిక అత్యాచారంపై ఇండియాలో మరోసారి తీవ్రమైన చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ ఫత్వా జారీ కావడం గమనార్హం. "భర్త ఎప్పుడు కోరుకున్నా భార్య అంగీకరించాల్సిందే. చివరికి ఒంటెపై ప్రయాణంలో ఉన్నా సరే" అని జకీరియా వ్యాఖ్యానించారు. 'మారిటల్ సెక్స్' పాశ్చాత్య దేశాలకు సంబంధించినదని, వివాహ జీవితంలో అత్యాచారం అనే మాటకు స్థానం లేదని అన్నారు. ఆరోగ్యం బాగాలేనప్పుడు, నెలసరి సమయంలో, బాలింతగా ఉన్నప్పుడు మాత్రమే కలయికను భార్య వ్యతిరేకించవచ్చని, ఆ సమయాల్లో మాత్రం స్త్రీకి హక్కు ఉంటుందని ఆయన అంటున్నారు.