: రెండు వారాల్లోగా కడప విమానాశ్రయం ప్రారంభం


ఈనెల 15వ తేదీలోగా కడప విమానాశ్రయాన్ని ప్రారంభిస్తామని ఎయిర్‌ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) దక్షిణ ప్రాంత రీజినల్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ నరసింహమూర్తి వెల్లడించారు. ఇందుకోసం జిల్లా అధికార యంత్రాంగం నుంచి సహాయం అవసరమని ఆయన అన్నారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో విమానాశ్రయ ప్రారంభంపై కలెక్టర్ తో చర్చలు జరిపిన ఆయన, అనంతరం మాట్లాడుతూ, ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, పౌర విమానయానశాఖ మంత్రి అశోక్‌ గజపతిరాజు తదితరులు హాజరవుతారని వివరించారు. కడప నుంచి తొలి సర్వీసుగా బెంగళూరుకు ఎయిర్ పిగాసుస్ విమానం తిరుగుతుందని తెలిపారు. విమానాశ్రయం ప్రాంగణంలో జింకల బెడద అధికంగా ఉందని, ముళ్ల పొదలనూ సత్వరమే తొలగించాలని అధికారులను కోరినట్టు వివరించారు.

  • Loading...

More Telugu News