: 'పెట్రో' మంట... ఏకంగా రూ. 3.96 పెరిగిన పెట్రోలు ధర


పెట్రోలు, డీజిల్ ధరలు భగ్గుమన్నాయి. పెట్రోలు ధరను రూ. 3.96, డీజిల్ ధరను రూ. 2.37 మేరకు పెంచుతున్నట్టు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ప్రకటించాయి. పెరిగిన ధరలు గురువారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. పెరిగిన పెట్రోలు ధరలపై వాహనదారులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్నేషనల్ మార్కెట్లో ముడిచమురు ధరలు పెరగడంతోనే పెట్రోలు, డీజిల్ ధరలు పెంచాల్సి వచ్చిందని చమురు సంస్థలు వెల్లడించాయి. కాగా, చమురు కంపెనీలు పెంచిన ధరలపై స్థానిక పన్నులు, సుంకాలు కలుపుకుని హైదరాబాద్ మార్కెట్లో లీటరు పెట్రోలుకు రూ. 4.50 పైగా, డీజిల్ ధరపై రూ. 2.75 వరకూ చెల్లించక తప్పదు. 2014 ఆగస్టు నుంచి పెట్రోలు ధర 10 సార్లు, డీజిల్ ధర 6 సార్లు తగ్గిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News