: 19 రోజుల్లో 57 అంతస్తుల స్కై సిటీ... చైనా కంపెనీ అద్భుతం
చైనాలో అభివృద్ధి శరవేగంగా జరుగుతోంది. అక్కడ కంపెనీలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ తమకు తామే సాటి అన్న రీతిలో అద్భుతాలు సృష్టిస్తున్నాయి. ద బ్రాడ్ సస్టెయినబుల్ బిల్డింగ్ కంపెనీ గ్లాస్, స్టీల్ తో హునాన్ ప్రావిన్స్ రాజధాని చాంగ్షాలో 57 అంతస్తుల మినీ స్కై సిటీని నిర్మించింది. అందుకు కేవలం 19 రోజులే పట్టడం విశేషం. మాడ్యులర్ పద్ధతిలో రోజుకు మూడు ఫ్లోర్లను అసెంబుల్ చేసుకుంటూ వచ్చామని, అందుకే త్వరితగతిన పూర్తయిందని సంస్థ ఉపాధ్యక్షుడు ఝియావో ఛాంగ్ గెంగ్ తెలిపారు. సంప్రదాయపద్ధతిలో భవన నిర్మాణమంటే ఇటుక తర్వాత ఇటుక పేర్చుకుంటూ వెళతారని, తాము బ్లాక్స్ ను కలుపుకుంటూ వెళ్లామని కంపెనీ ఇంజినర్ చెన్ జియాంగ్ కియాన్ వివరించారు.