: డేరాలో న్యూస్ చానెల్... అందరూ మెచ్చుకుంటున్నారు!


నేపాల్ లో భూకంపం పలు సంస్థలను కూడా రోడ్డున పడేసింది. భూకంపం కారణంగా ఓ టీవీ చానల్ భవనాలు ధ్వంసం కాగా, ఇప్పుడా వార్తా స్రవంతి ఓ టెంటులో కార్యకలాపాలు సాగిస్తోంది. సాంకేతిక పరికరాలు కొన్ని దెబ్బతిన్నా, ఉన్న కొద్దిపాటి సిబ్బంది సాయంతో రాజధాని ఖాట్మండూలో ఓ డేరా ఏర్పాటు చేసుకుని అందులో నుంచే వార్తలు అందిస్తోంది. ప్రజలకు సమాచారం అందించాలన్నదే తమ ఉద్దేశమని, ఆ స్ఫూర్తితోనే పనిచేస్తున్నామని ఆ చానెల్ న్యూస్ అధిపతి దిల్ భూషణ్ పాఠక్ అన్నారు. ఈ చానెల్ పేరు కాంతిపూర్ టీవీ చానెల్ కాగా, వీరి ప్రయత్నాన్ని అందరూ హర్షిస్తున్నారు. ఈ సంక్షోభ సమయంలో ప్రజలకు సమాచారం అందించడం తమ బాధ్యత అని భావిస్తున్నామని పాఠక్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News