: క్లాస్ అయిపోగానే ఇంటింటికీ తిరుగుతున్నారు
కాలేజ్ లో క్లాస్ అయిపోగానే స్నేహితులతో ఓ షికారు కెళ్లి, మెస్ లో భోజనం చేసి, రాత్రి కుదిరితే ఓ సినిమా చూసి హాయిగా పడుకుని, మళ్లీ తెల్లారిలేచి చదువుకుని క్లాస్ కు రెడీ కావడం విద్యార్థులు సాధారణంగా చేసే పని. కానీ ఢిల్లీలోని పలు కళాశాలల్లో చదువుతున్న నేపాలీ విద్యార్థుల దినచర్యలో మార్పు వచ్చింది. తమ దేశానికి ఏదైనా చేయాలని పరితపిస్తున్నారు. భూకంప బీభత్సానికి అతలాకుతలమైపోయిన నేపాల్ పునర్నిర్మాణంలో భాగస్వాములుగా నిలిచేందుకు విరాళాలు సేకరిస్తూ బిజీగా గడుపుతున్నారు. ఇప్పటి వరకు సేకరించిన మొత్తంతో సహాయ సామగ్రి కొనుగోలు చేసి తమ దేశం పంపామని, మరింతమందికి సహాయపడేలా విరాళాలు సేకరిస్తున్నామని వారు వెల్లడించారు.