: అది కిసాన్ పాదయాత్ర కాదు, పశ్చాత్తాప యాత్ర: బీజేపీ ఎద్దేవా


కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ 'కిసాన్ పాదయాత్ర' చేపట్టడంపై బీజేపీ విమర్శలు చేసింది. అది కిసాన్ పాదయాత్ర కాదని, రాహుల్ పశ్చాత్తాప యాత్ర అని ఎద్దేవా చేసింది. ఈ యాత్రకు రాహుల్ గాంధీ పశ్చాత్తాప యాత్ర అని పేరు పెట్టుకోవాలని, మహారాష్ట్రలో కాంగ్రెస్ పాలన సాగిన సమయంలో ఆయా పథకాలు అమలు చేయనందుకు ఈ సందర్భంగా పశ్చాత్తాప పడాలని బీజేపీ ప్రతినిధి సంబిత్ పట్రా పేర్కొన్నారు. నేషనల్ బ్యూరో ఆఫ్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) నివేదికల ప్రకారం... కాంగ్రెస్, ఎన్సీపీ హయాంలోనే అత్యధిక సంఖ్యలో బలవన్మరణాలు చోటుచేసుకున్నాయని పట్రా వివరించారు. మోదీ సర్కారు రైతు అనుకూల పథకాలతో ముందుకుపోతోందని కొనియాడారు.

  • Loading...

More Telugu News