: డ్రీమ్‌లైనర్ విమానాలు ... మళ్లీ గగన విహారం
బ్యాటరీలలో మంటలు చెలరేగినందువలన వాడకం నిలిపివేసిన డ్రీమ్‌లైనర్ బోయింగ్ 787 విమానాలు మళ్లీ మరో నెలరోజుల్లో గగన విహారం చేసే అవకాశం కనిపిస్తోంది. బోయింగ్ కంపెనీ తయారుచేసే ఈ విమానాలకు కొత్త రకం బ్యాటరీలను అమర్చి తిరిగి వినియోగించడానికి అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌ఏఏ) వారు ఆమోదం తెలిపారు.
ఇలా బ్యాటరీల్లో మంటలు రావడంతో ప్రపంచవ్యాప్తంగా బోయింగ్ వారి 787 విమానాలు 50 వరకు సర్వీసులు నిలిచిపోయాయి. ఇప్పుడు జపాన్‌కు చెందిన సంస్థ కొత్త బ్యాటరీలు రూపొందించింది. బోయింగ్ ఇంజినీర్ల బృందం భారత్‌కు వచ్చి, డీజీసీఏ, ఎయిర్‌ఇండియా ఇంజినీర్లతో కలిసి కొత్త బ్యాటరీలను అమరుస్తారు. ఎయిర్ ఇండియా వద్ద మొత్తం ఆరు డ్రీంలైనర్ విమానాలు ఉన్నాయి. మే నెలాఖరులోగా ఇవి మళ్లీ ప్రయాణాలు మొదలు పెడతాయని అదికారులు భావిస్తున్నారు.