: మలాలాపై దాడి చేసిన వారికి 25 ఏళ్ల జైలు శిక్ష


అత్యంత ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ శాంతి పురస్కారాన్ని అందుకున్న సాహస బాలిక మలాలా యూసుఫ్ జాయ్ పై దాడి చేసిన దోషులకు పాక్ ఉగ్రవాద వ్యతిరేక కోర్టు శిక్ష ఖరారు చేసింది. దోషులకు 25 ఏళ్ల జైలు శిక్షను విధిస్తున్నట్టు తీర్పును వెలువరించింది. మలాలాకు 15 ఏళ్ల వయసు ఉన్నప్పుడు, ఆమె స్కూలుకు వెళుతుండగా ఓ ఉగ్రవాది ఆమె తలలోకి కాల్చాడు. ఇదే దాడిలో ఆమెతో పాటు షాజియా రంజాన్, కైనత్ రియాజ్ అనే అమ్మాయిలు కూడా గాయపడ్డారు. ఈ దాడి వెనుక తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్ కమాండర్ ముల్లా ఫజులుల్లా హస్తం ఉందని ఉగ్రవాదులు అంగీకరించారు. ఈ ముగ్గురు అమ్మాయిలపై దాడి చేసిన ఉగ్రవాదులను గత సెప్టెంబరులో అరెస్ట్ చేశారు.

  • Loading...

More Telugu News