: చత్తీస్ గఢ్ లో ఘోర రోడ్డు ప్రమాదం... పెళ్లి వ్యాన్ బోల్తా పడి 11 మంది దుర్మరణం


చత్తీస్ గఢ్ లో కొద్దిసేపటి క్రితం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పెళ్లి బృందంతో బయలుదేరిన ఓ వ్యాన్ అదుపుతప్పి బోల్తా పడింది. రాష్ట్రంలోని బాలోడ్ జిల్లాలో చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో వ్యాన్ లోని 11 మంది అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. తక్షణమే స్పందించిన స్థానికులు క్షతగాత్రులను హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డవారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News