: కేసీఆర్ వ్యాఖ్యలను ఆయన విచక్షణకే వదిలేస్తున్నాం: సీపీఐ
టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సీపీఐ తెలంగాణ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శలు గుప్పించారు. తెలంగాణకు సీపీఐ వ్యతిరేకమంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. కేసీఆర్ వ్యాఖ్యలను ఆయన విచక్షణకే వదిలేస్తున్నామని అన్నారు. తెలంగాణలో జల విధానంపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. భూసేకరణ చట్టంతో రైతులు, సామాన్య ప్రజలు నష్టపోతారని చాడ తెలిపారు. భూ సేకరణకు నిరసనగా మే 14న జైల్ భరో కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు వెల్లడించారు.