: ఎంతో సంతోషంగా ఉందన్న సుస్మితాసేన్
బాలీవుడ్ అందాల నటి, మాజీ విశ్వ సుందరి సుస్మితాసేన్ ఎంతో సంతోషంగా ఉంది. బెంగాలీ చిత్రంలో నటించాలనే తన తండ్రి కలను నెరవేర్చానని... ఇది తనకెంతో ఆనందాన్ని కలిగిస్తోందని చెప్పింది. ఆమె నటించిన బెంగాలీ చిత్రం 'నిర్బాక్' రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రతి విషయంలో దర్శకుడు శ్రీజిత్ ముఖర్జీ అన్ని విధాలా సహకరించాడని కొనియాడింది. మరోవైపు శ్రీజిత్ మాట్లాడుతూ, బెంగాలీ శైలికి తగ్గట్టుగా ఈ చిత్రంలో సుస్మిత చాలా అద్భుతంగా నటించిందని పొగడ్తల వర్షం కురిపించాడు.