: బెజవాడ కనకదుర్గ వారధిపై చెలరేగిన మంటలు...ఇద్దరికి గాయాలు
విజయవాడ కనకదుర్గ ఆలయానికి దారితీసే వారధిపై కొద్దసేపటి క్రితం పెద్ద ప్రమాదమే చోటుచేసుకుంది. ప్రశాంతంగా ఉన్న వారధిపై ప్రమాదం నేపథ్యంలో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. వారధిపై వెళుతున్న ఓ బైక్ అదుపు తప్పి పెయింట్ డబ్బాలు, స్పిరిట్ క్యాన్లను ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా చెలరేగిన మంటలు బైక్ ను చుట్టుముట్టాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులకు గాయాలు కాగా, వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అక్కడికి సమీపంలో ఉన్న వ్యక్తులు వెనువెంటనే స్పందించి మంటలను ఆర్పివేశారు.