: న్యాయమూర్తుల ఎంపికలో రాజకీయ నేతల ప్రమేయం సరికాదు: రామ్ జెఠ్మలానీ


జాతీయ న్యాయ నియామకాల సంస్థపై దేశంలో వాడీవేడీ చర్చ కొనసాగుతూనే ఉంది. మొన్నిటికి మొన్న ఈ విషయంలో కోర్టు తీర్పు వెలువడే దాకా ఆ సంస్థ సమావేశాలకు హాజరుకాలేనని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్.ఎల్.దత్తు నేరుగా ప్రధాన మంత్రి కార్యాలయానికే లేఖ రాసి సంచలనం సృష్టించారు. తాజాగా కేంద్ర న్యాయ శాఖ మాజీ మంత్రి, ప్రముఖ న్యాయవాది రామ్ జెఠ్మలానీ ఈ కమిషన్ లో సభ్యుల ఎంపికపై విమర్శలు గుప్పించారు. న్యాయ నియామకాల సంస్థలో రాజకీయ నేతలకు స్థానం కల్పించడం తప్పేనని ఆయన పేర్కొన్నారు. రాజకీయ నేతల ప్రమేయంతో న్యాయ వ్యవస్థ ప్రతిష్ఠకు భంగం కలుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు రామ్ జెఠ్మలానీ సుప్రీంకోర్టులోని రాజ్యాంగ ధర్మాసనం ముందు తన వాదనలు వినిపించారు.

  • Loading...

More Telugu News