: మమతా బెనర్జీకి సీఎం కేజ్రీవాల్ అభినందనలు
పశ్చిమబెంగాల్ మున్సిపల్ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడంపై ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అభినందనలు తెలిపారు. ఈ మేరకు కేజ్రీ తమ అధినేత్రికి ఫోన్ చేసి మాట్లాడినట్టు తృణమూల్ జాతీయ అధికార ప్రతినిధి డెరెక్ ఒబెరాయ్ చెప్పారు. తాజాగా జరిగిన కోల్ కతా మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో 144 వార్డుల్లో తృణమూల్ 114 గెలుచుకుంది. అటు బెంగాల్లోని 91 మున్సిపాలిటీల్లో 69 స్థానాలు కైవసం చేసుకుని విజయఢంకా మోగించింది.