: పోలీసులకు కీలక సమాచారమిచ్చిన నటి నీతూ అగర్వాల్... ఎమ్మెల్యేకు సంబంధం ఉందని వెల్లడి


ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో అరెస్టైన నటి నీతూ అగర్వాల్ ను కర్నూలు జిల్లా పోలీసులు ఇంటరాగేట్ చేస్తున్నారు. ఈ విచారణలో నీతూ పలు కీలక విషయాలను బయటపెట్టినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎర్రచందనం స్మగ్లర్లతో కర్నూలు జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యేతో పాటు మరో నేతకు కూడా మంచి సంబంధాలున్నాయని నీతూ వెల్లడించినట్టు తెలుస్తోంది. వీరిద్దరూ స్మగ్లర్లకు సహకరించేవారని తెలిపింది. అయితే నీతూ వెల్లడించిన ఎమ్మెల్యే, మరో నేత ఎవరనే విషయాన్ని పోలీసులు వెల్లడించలేదు. ఈ అంశానికి సంబంధించి మరింత లోతుగా విచారించనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు, ఈ స్మగ్లింగ్ వెనుక ఎంతటి బడా నేతలున్నా వదిలే ప్రసక్తే లేదని కర్నూలు జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News