: ప్రభుత్వ ఉద్యోగుల్లారా జర భద్రం... ఆస్తులు ప్రకటించకపోతే, వాటిని అవినీతిగానే గుర్తించి చర్యలు తీసుకుంటారు
త్వరలో రాబోతున్న కొత్త లోక్ పాల్ చట్టం ప్రభుత్వ ఉద్యోగులకు చుక్కలు చూపించబోతోంది. అయితే, అందరికీ కాదులెండి... జనాలను జలగల్లా పీడించి అక్రమాస్తులను వెనకేసుకున్న అవినితి చక్రవర్తులకు మాత్రమే. ఇకపై ప్రభుత్వ ఉద్యోగులందరూ తమ ఆస్తుల రిటర్న్స్ లో అన్ని వివరాలను పేర్కొనాల్సి ఉంటుంది. ఏదైనా ఆస్తిని రిటర్న్స్ లో పేర్కొనకపోతే... దాన్ని అవినీతి ఆస్తిగా పరిగణిస్తారు. అంతే కాదు, చట్ట ప్రకారం తీసుకోవాల్సిన చర్యలన్నింటినీ తీసుకుంటారు. 'కేంద్ర సిబ్బంది వ్యవహారాల' శాఖ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి, అవినీతి ఉద్యోగులు ఒళ్లు దగ్గర పెట్టుకుని పని చేస్తే మంచిది.