: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చదలవాడ
టీటీడీకి కాబోయే చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలసి ఈ ఉదయం స్వామివారి దర్శనంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారి తీర్థ ప్రసాదాలను ఆలయ పూజారులు చదలవాడకు అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దయవల్లే తనకు టీటీడీ చైర్మన్ అవకాశం వచ్చిందని చెప్పారు. సామాన్య భక్తుడిలా ఉండి సేవ చేస్తానన్నారు. మే 2వ తేదీ ఉదయం 11 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నట్టు చదలవాడ తెలిపారు.