: సంచిలో 3 నెలల చిన్నారి... ఆస్పత్రికి తరలించిన ఆటో డ్రైవర్లు
మానవత్వం మంటగలుస్తోందో, పేగు బంధం తెగిపోతోందో తెలియదు కాని, నెల్లూరు జిల్లా కావలిలో నేటి ఉదయం దారుణం వెలుగుచూసింది. ముక్కుపచ్చలారని మూడు నెలల చిన్నారిని సంచిలో పెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు పట్టణంలోని ఆర్టీసీ కూడలిలో వదిలివెళ్లారు. సంచిలో చిన్నారి ఏడుపును గమనించిన అక్కడి ఆటో డ్రైవర్లు సంచి తెరిచి చూసి నివ్వెరపోయారు. అనంతరం హుటాహుటిన చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు అసలు ఈ ఘటనకు దారి తీసిన కారణాలను వెలికితీసేందుకు యత్నిస్తున్నారు.