: ఆప్ ఎమ్మెల్యేపై ఎఫ్ఐఆర్ నమోదు
ఆమ్ ఆద్మీపార్టీ నేత, ఢిల్లీలోని తాలిక్ నగర్ ఎమ్మెల్యే జర్నాలి సింగ్ పై కేసు నమోదైంది. ఓ ఇంజనీర్ పై దాడికి పాల్పడినట్టు వచ్చిన ఫిర్యాదుతో ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఢిల్లీలోని పశ్చిమ ప్రాంతంలో ఉన్న అక్రమ కట్టడాలను తొలగించేందుకు సిబ్బందితో వెళ్లిన తనపై దాడి చేశారని, విధుల నిర్వహణకు అడ్డుపడ్డారని జూనియర్ ఇంజనీర్ అజహర్ ముస్తఫా ఎమ్మెల్యే జర్నాలి సింగ్ పై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా అక్రమ కట్టడాల తొలగింపుకు సంబంధించిన అధికారిక పత్రాలను ఎమ్మెల్యే చించేశారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నట్టు పోలీసులు వెల్లడించారు.