: కాసేపట్లో పెళ్లి... వరుడు పరార్
కాసేపట్లో కల్యాణమండపంలో వివాహం జరుగనుంది. ఇంతలో పెళ్లికొడుకు పరారైన ఘటన విశాఖపట్టణం గాజువాకలోని సమతానగర్ లో చోటుచేసుకుంది. సమతానగర్ కు చెందిన రవి అనే యువకుడికి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. వారి వివాహానికి నేటి మధ్యాహ్నం ముహూర్తం నిశ్చయించారు. దీంతో అన్నిపనులూ పూర్తయిన తరువాత వివాహ సమయానికి వరుడు పరారయ్యాడు. దీంతో వధువు బంధువులు ఆందోళనకు గురయ్యారు. వరుడి పరారీకి కారణాలు తెలియాల్సి ఉంది.