: మహిళా రైతుపై భూస్వామి దాష్టీకం


అరాచకాల ఉత్తరప్రదేశ్ లో దురాక్రమణలు, దాష్టీకాలకు అంతులేకుండా పోతోంది. అర్థ, అంగ బలమున్నవారు మాత్రమే అక్కడ మనగలిగే పరిస్థితులు నెలకొన్నాయి. దళిత మహిళా రైతుపై భూస్వామి దాష్టీకం వెలుగు చూసింది. బలరామ్ పూర్ జిల్లాలోని గుడార-జద్దాపూర్ గ్రామంలోని దళిత మహిళా రైతుకు సంబంధించిన భూమిని వాజిద్ అలీ, సాజిద్ అలీ, మొహమ్మద్ ముత్విల్, మొహమ్మద్ మత్లబ్ లు ఆక్రమించుకున్నారు. వారితో తలపడే సత్తాలేని ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీంతో న్యాయస్థానం స్టే ఉత్వర్వులిచ్చి, విచారణ జరుపుతోంది. కేసును ఉపసంహరించుకుని, భూమిని తమకు బదలాయించాలంటూ నిందితులు ఆమెను ఒత్తిడి చేస్తున్నారు. రెండు నెలల క్రితం ఆమెను, ఆమె కొడుకును చిత్రహింసలకు గురిచేశారు. దీంతో ఆమె కుమారుడు ఊరొదిలి పారిపోయాడు. ఇప్పటికీ అతని ఆచూకీలేదు. తాజాగా నిందితులు మరోసారి ఆమెపై దాడికి దిగారు. ఆమె బట్టలూడదీసి, తలకిందులుగా చెట్టుకు వేలాడదీసి చితక్కొట్టారు. వారి చిత్రహింసలు భరించిన ఆమె తులసీపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా, ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిన పోలీసులు ఆమెను గెంటేశారు. దీంతో ఆమె జిల్లా కలెక్టర్ ను ఆశ్రయించింది. దీనికి స్పందించిన కలెక్టర్ ప్రీతి శుక్లా ఆమె ఫిర్యాదు స్వీకరించేందుకు నిరాకరించిన ఎస్ఐ ఎస్ కే రాయ్, ఏఎస్ఐ అలోక్ కుమార్ లను సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు అందజేయాలంటూ ఆమె అడిషనల్ పోలీస్ సూపరిండెంట్ ఎల్బీ యాదవ్ ను ఆదేశించారు.

  • Loading...

More Telugu News