: ఉస్మానియా యూనివర్శిటీలో ఉద్రిక్తత


ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం కొద్ది రోజుల క్రితం ఆందోళనకు దిగిన హైదరాబాదు ఉస్మానియా విద్యార్థులు మరోసారి ఆందోళన బాట పట్టారు. యూనివర్శిటీకి వైస్ ఛాన్సలర్ ను నియమించాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. పలువురు విద్యార్థులు ఆర్ట్స్ కాలేజీ భవనంపైకి ఎక్కి ధర్నా చేస్తున్నారు. ఈ ఉదయం నుంచి కూడా వారు భవనం పైనే ఉండటంతో, యూనివర్శిటీ క్యాంపస్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భవనం పైనున్న వారిని కిందకు రప్పించేందుకు యూనివర్శిటీ అధికారులు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.

  • Loading...

More Telugu News