: టీచర్లతో విద్యార్థుల లవ్వాటలు... తమిళనాడు ప్రభుత్వం సీరియస్


ఇటీవలి కాలంలో తమిళనాట విద్యార్థులతో లేడీ టీచర్లు ప్రేమలో పడుతున్న సంఘటనలు ఎక్కువ కావడంతో తమిళ సర్కారు సీరియస్ అయింది. విద్యాశాఖ అధికారులను పిలిచి చీవాట్లు పెట్టింది. ఈ తరహా పోకడలు తక్షణం అరికట్టాలని ఆదేశాలు జారీ చేసింది. లేకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. కాగా, కదయనల్లూర్‌ లోని ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో రెండు నెలల క్రితం మార్చి 31న ఓ 26 ఏళ్ల మహిళా టీచర్, పదహారేళ్ల స్టూడెంట్ ను ప్రేమించి పారిపోయింది. ఈ ఘటన జరిగిన రెండు వారాల తరువాత దిండుగల్ జిల్లాలోని ఓ ట్యుటోరియల్ కాలేజీలో 22 ఏళ్ల మరో టీచర్, 20 ఏళ్ల అబ్బాయితో వెళ్లిపోయింది. ఈ ఘటనలతో స్పందించిన తమిళ సర్కారు వీటిని ఆపేదెలా? అంటూ ఓ కమిటీని నియమించింది. లేడీ టీచర్లు శరీరం కనిపించేలా స్కర్టులు, టీ షర్టులు, జీన్ పాంట్ల లాంటి పాశ్చాత్య దుస్తులను ధరించరాదని, తరగతి గదుల్లోకి సెల్ ఫోన్లు తీసుకురాకూడదని నిబంధనలు విధించింది. ప్రేమ కలాపాలపై నిఘా కోసం సీసీటీవీలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అయితే, విద్యార్థులకు నియమావళి ఉండాలి కానీ, టీచర్లపై నియంత్రణ ఏంటని కొందరు వాదిస్తున్నారు కూడా.

  • Loading...

More Telugu News