: నేపాల్ ను మరోసారి వణికించిన భూకంపం


నేపాల్ ను భూకంపాలు వణికిస్తున్నాయి. ఆదివారం సంభవించిన భారీ భూకంపం ధాటికి తేరుకోని నేపాల్ ను భూ ప్రకంపనలు పట్టికుదిపేస్తున్నాయి. భారీ భూకంపం తరువాత ఇప్పటి వరకు 30 సార్లు భూమి స్వల్పంగా కంపించినట్టు చెబుతున్నారు. తాజాగా ఈ మధ్యాహ్నం 3.9 రీడింగ్ తో స్వల్ప భూకంపం సంభవించిందని భూగర్భశాస్త్రవేత్తలు తెలిపారు. స్వల్ప భూకంపం కావడంతో దీనికి పెద్దగా ప్రమాదం సంభవించి ఉండదని, అయితే ఆదివారం సంభవించిన భూకంప ప్రభావానికి తట్టుకుని నిల్చి, బీటలిచ్చిన భవనాలకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని వారు వెల్లడించారు.

  • Loading...

More Telugu News