: నేపాల్ కు పొంచి ఉన్న మరో ముప్పు!


భూకంపంతో నేలమట్టమైన నేపాల్ కు మరో ముప్పు పొంచి ఉందంటున్నారు శాస్త్రవేత్తలు. భూకంప ఫలితంగా మరికొన్ని వారాల్లో నేపాల్ లో భారీగా కొండచరియలు, మట్టిదిబ్బలు విరిగిపడే ప్రమాదం ఉందని చెబుతున్నారు. రానున్నది రుతు పవనాల సీజన్ కావడంతో, కురిసే భారీ వర్షాల కారణంగా ఆ ముప్పు మరింత తీవ్రతను సంతరించుకుంటుందని మిచిగాన్ యూనివర్శిటీ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం స్వల్ప స్థాయిలో విరిగిపడుతున్న కొండచరియలు, మట్టిదిబ్బలు సహాయక చర్యలకు ఆటంకం కలిగిస్తున్నాయి. నేపాల్ పర్వత ప్రాంతం కావడంతో, భూకంపం కారణంగా అక్కడి నేల భారీ కుదుపులకు లోనైందని, తద్వారా కొండచరియలు, మట్టిదిబ్బలు మరింత పెద్ద ఎత్తున విరిగిపడతాయని వర్శిటీ జియోమార్ఫాలజిస్ట్ మార్టిన్ క్లార్క్ వివరించారు. నేపాల్ లో వేలాది ప్రాంతాలు ఈ ముప్పు బారిన పడే అవకాశాలున్నాయని క్లార్క్ బృందం గుర్తించింది.

  • Loading...

More Telugu News